![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -208 లో.....శౌర్య కళ్ళు తిరిగి పడిపోవడంతో సిరప్, టాబ్లెట్ వేసారా అంటూ కార్తీక్ అడుగుతాడు. అవి వెయ్యగానే శౌర్య మాములుగా అయి పడుకుంటుంది. నా కూతురికి ఏమైంది బాబు ఇలా అంటున్నారని దీప అడుగుతుంది. ఏం కాలేదు అని కార్తీక్ చెప్పినా కూడా దీప నమ్మకుండా నాపై ఒట్టేయ్యండి అని కార్తీక్ చెయ్ తన తలపై పెట్టుకుంటుంది. ప్రాబ్లమ్ ఉంది అది నీ వల్లే.. అది ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అలా ఉంచడం మన బాధ్యత కానీ నువ్వు అలా చేస్తున్నావా అని కార్తీక్ అంటాడు.
బయటవారి గురించి పట్టించుకోకు మన కూతురు కోసం మనం ఉందామని కార్తీక్ అసలు నిజం చెప్పకుండా తప్పించుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ బాబు మీ మాటలు నమ్ముతున్న శౌర్యకి ఏం కాదని అనుకుంటుంది. ఆ తర్వాత కాంచన, అనసూయలు గదిలో మాట్లాడుకుంటారు. రేపు కార్తీక్ బర్త్ డే కానీ వాడికి సెలెబ్రేషన్స్ నచ్చవని కాంచన అంటుంది. ఆ మాటలు దీప వింటుంది. మరుసటి రోజు కార్తీక్ లేచేసరికి గది అంతా బెలూన్ లతో నింపేస్తుంది. కార్తీక్ లేచి ఇదంతా ఎవరు చేశారని అడుగగా.. దీప చేసిందని వాళ్ళు అంటారు. కార్తీక్ అంటే దీపకి ఎంత ఇష్టమోనని కాంచన, అనసూయ లు అంటారు. అమ్మకి నాన్న అంటే ఎంత ఇష్టమోనని శౌర్యా అంటుంది. కానీ దీప సైలెంట్ గా ఉంటుంది. ఇదంతా ప్రేమ కాదు అభిమానమని కార్తీక్ అనుకుంటాడు.
మరొకవైపు ఎలాగైనా బావని కలిసి హగ్ చేసుకొని విషెస్ చెప్పాలని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. సుమిత్రని అడుగు కార్తీక్ ఇంటికి వెళదామని అని పారిజాతం సలహా ఇస్తుంది. సుమిత్ర దగ్గరికి వెళ్లి జ్యోత్స్న మాట్లాడడం దశరథ్ విని కోప్పడతాడు. మరుసటి రోజు జ్యోత్స్న, పారిజాతం మాటలు విని శివన్నారాయణ కోప్పడతాడు. ఫోన్ చేసి అయిన విష్ చెయ్ అని పారిజాతం అనగానే.. జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. దీప, శౌర్యల సందడి వినపడి ఇంకా ఆవేశపడుతుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |